మందుబాబుల రక్త నమూనాల్లో మద్యం మోతాదును విశ్లేషించి లెక్కిస్తారు. 100 మిల్లీల లీటర్ల రక్తంలో మద్యం మోతాదు 30 ఎంజీలోపు ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వదిలేస్తారు. అంతకన్నా ఎక్కువగా ఉంటే కేసు నమోదు చేస్తారు. 100 ఎంజీలోపు మద్యం సేవించిన వారు కొంచెం తాగితే ఏమౌవుతుంది లే అంటూ తనిఖీల్లో దొరికినప్పుడు బదులిచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 20 వేల 326 మంది మందుబాబులు పోలీసులకు దొరికారు. వీరిలో 10 వేల 570 మంది బీఏసీ.. 100 ఎంజీలోపే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అధికశాతం మంది ద్విచక్ర వాహనదారులే పట్టుబడుతున్నారు. పోలీసులకు దొరికిన వారిలో 15 వేల 456 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారంటే పరిస్థితి అర్ధమవుతోంది.
మహిళలు కూడా ఉన్నారు
మందుబాబుల లెక్కను పోలీసులు వయసు వారీగా తేలుస్తారు. ఆరు నెలల్లో పోలీసులకు దొరికిన వారిలో సగం మంది 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉన్నారు. వీరితో పాటు 10 మంది మైనర్లు... మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. పది మంది మహిళలు కూడా తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రతి రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలు పాటిస్తూ రోడ్డెక్కాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.12 కోట్ల విలువైన తిమింగలం లాలాజలం స్వాధీనం.. ముఠా అరెస్ట్