ETV Bharat / state

అధికారులకు పట్టని ఆవేదన... నగర శివారు ప్రాంతాలు మురికికూపాలు - హైదరాబాద్​లో దోమల బెడద

హైదరాబాద్​ నగర శివారు ప్రాంతాలైన నాగారం దమ్మాయిగూడ ప్రాంతాల్లోని అపరిశుభ్రత..  వల్ల దోమల బెడద అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల వచ్చి అధికారులతో సమీక్షలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు పట్టని ఆవేదన... నగర శివారు ప్రాంతాలు మురికికూపాలు

author img

By

Published : Jan 7, 2020, 7:37 PM IST

హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై చెత్త డబ్బాలు, ఇరుకైన రోడ్లు, నాళాలు అపరిశుభ్రత వల్ల రోడ్డుపై చెత్త పేరుకుపోయి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్త.. నిలిచిపోయిన వాన నీరు వల్ల దోమల బెడద ఎక్కువైందని అంటున్నారు.

వారానికి ఒక్కసారి దోమల పొగ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. దోమల వల్ల ఎన్ని జెట్ కాయిల్స్, ఆలౌట్లు వాడిన ఉపయోగం లేకపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల డెంగ్యూ వంటి విషపూరిత జ్వరాల బారినపడి ఐదు మంది చనిపోయారని.. ఒక జవాన్ కూడా మృతిచెందాడని స్థానికులు అంటున్నారు.

ఇక్కడి ప్రజల అనారోగ్య తీవ్రతను తెలుసుకొని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వచ్చి సమీక్షలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.