ETV Bharat / state

Railway Coach: ఎక్స్​ప్రెస్​లకు ఇక అన్నీ ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు - హైదరాబాద్​ వార్తలు

ఐసీఎఫ్ బోగీల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన రైల్వే శాఖ ఆధునిక ఎల్​హెచ్​బీ బోగీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఉత్పత్తిని బట్టి దశలవారీగా బోగీలను మార్చనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంప్రదాయ బోగీలో స్లీపర్‌లో 72 బెర్త్​లు ఉంటే... ఎల్‌హెచ్‌బీ స్లీపర్‌ బోగీల్లో 80 బెర్తులు ఉంటాయని వెల్లడించారు.

Railway Coach
Railway Coach
author img

By

Published : Aug 23, 2021, 8:59 AM IST

ప్రయాణికుల బోగీలను రైల్వేశాఖ ఆధునికీకరిస్తోంది. కాలం చెల్లిన ఐసీఎఫ్‌(ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ) బోగీల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ(లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) బోగీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 18 నాటికి 30 జతల రైళ్లకు పాత ఐసీఎఫ్‌ బోగీలను తొలగిస్తూ ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఐసీఎఫ్‌ బోగీల ఉత్పత్తిని రైల్వేశాఖ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఇక కొత్తగా తయారయ్యే బోగీలన్నీ ఎల్‌హెచ్‌బీలే ఉండనున్నాయి.

.

160 కి.మీ. వేగానికి అవకాశం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, దక్షిణ్‌, చార్మినార్‌, గుంటూరు ఇంటర్‌సిటీ, విజయవాడ ఇంటర్‌సిటీ, జైపూర్‌, ఎల్‌టీటీ దురంతో, కాగజ్‌నగర్‌, రాయలసీమ, నారాయణాద్రి, విశాఖపట్నం డబుల్‌డెక్కర్‌, ధర్మవరం, గోల్కొండ, కోకనాడ తదితర ఎక్స్‌ప్రెస్‌లను ఎల్‌హెచ్‌బీ బోగీల రైళ్లుగా మార్చింది. మిగిలినవాటికీ కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని బట్టి దశలవారీగా బోగీలను మార్చనున్నట్లు రైల్వేశాఖవర్గాలు చెబుతున్నాయి. ఎల్‌హెబీ బోగీలు గంటకు గరిష్ఠంగా 140-160 కి.మీ. వరకూ వేగాన్ని తట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో రైల్వేట్రాకులను మరింత బలోపేతం చేస్తే ఈ బోగీలతో రైళ్లు 130 నుంచి 160 కి.మీ. వేగంతో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

.

ప్రయోజనాలు ఏంటి?

.

ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తయారయ్యే సంప్రదాయ బోగీలో స్లీపర్‌లో 72 బెర్తులు ఉంటే.. జర్మనీ పరిజ్ఞానంతో తయారుచేసే ఎల్‌హెచ్‌బీ స్లీపర్‌ బోగీల్లో 80 బెర్తులు ఉంటాయి. పొడవు 2 మీటర్లు అధికం. ఒక్కో బోగీలో మరో 8 మంది అదనంగా ప్రయాణించవచ్చు. రైలు ప్రమాదం జరిగినప్పుడు సంప్రదాయ బోగీలు ఒకదానిపైకి మరోటి ఎక్కి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. ఎల్‌హెచ్‌బీ అయితే ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా భూమిలోకి కూరుకుపోయినట్లు ఉంటాయి. దీంతో తక్కువ నష్టం జరుగుతుంది. బయోటాయిలెట్లు, జారిపడకుండా పీవీసీ ఫ్లోరింగ్‌, పెద్ద కిటికీలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు వీటిలో ఉంటాయి.

ఇదీ చూడండి: Mumbai history: కట్నంగా ముంబయి నగరాన్నే ఇచ్చిన రాజు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.