Moodle Ed Tech Platform that bought this E ABYAS: మూడిల్ వంటి ఓపెన్ ఎడ్ టెక్ ఫ్లాట్‌ఫాం భారతదేశ డిజిటల్ విద్యను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దిగ్గజ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మూడిల్ సంస్థ.. హైదరాబాద్‌కు చెందిన ఈ లెర్నింగ్ సంస్థ ఈ-అభ్యాస్‌ను కొనుగోలు చేయడంపట్ల మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
మూడిల్ సంస్థ ఉత్పత్తి అభివృద్ధికి.. అంతర్జాతీయ సేవలకు మద్దతునిచ్చేందుకు తదుపరి 2 ఏళ్లలో భారతీయ విభాగాన్ని 400 మంది సభ్యులతో కూడిన బృందంగా పెంచేందుకు కృషి చూస్తోందని సంస్థ తెలిపింది. విద్యారంగంలో గొప్ప చరిత్ర కలిగిన మూడిల్‌కు భారత్ ఒక ప్రత్యేకమైన దేశమని సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, వ్యవస్థాపకులు మార్టిన్ డౌగియామాస్ పేర్కొన్నారు. భారతదేశంలోని అనేక సంస్థలు ఇప్పటికే మూడిల్ కమ్యూనిటీలో భాగంగా ఉన్నాయని.. ఇంకా చాలా మంది ఆన్‌లైన్ లెర్నింగ్ సౌలభ్యాన్ని తమ ఆచరణలోకి ఎలా తీసుకురావాలా అని అన్వేషిస్తున్నారని అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఈ-అభ్యాస్ సంస్థతో కలిసి భారతదేశంలోని అధ్యాపకులకు మెరుగైన సేవలందించేందుకు ఎదురుచూస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓపెన్-సోర్స్ మూడిల్ సాంకేతికతను మెరుగుపరచడానికి మరింత కలిసికట్టుగా పనిచేయడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నామని మూడిల్ సంస్థ వ్యవస్థాపకులు మార్టిన్ డౌగియామాస్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: