నైరుతి రుతువవనాల రాకకు అండమాన్ నికోబార్ సమీపంలో అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. రెండు రోజుల్లో అండమాన్‌లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేశారు. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు. తెలంగాణలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో పెనుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.
ఇవీ చూడండి: నేడు కాళేశ్వరం పనులను పరిశీలించనున్న కేసీఆర్
రుతు పవనాలకు వాతావరణం అనుకూలం - monsoons
రైతులకు శుభవార్త అందించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు రావడానికి అండమాన్ నికోబార్ సమీపంలో అనుకూలంగా ఉందని వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు.