యాదాద్రి భువనగిరికి చెందిన సత్యనారాయణ, శ్రీనివాసరావులు బతుకుదెరువు కోసం హెదరాబాద్ వచ్చారు. వీరికి సికింద్రాబాద్ రాణిగంజ్‌కు చెందిన రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. డబ్బుల విషయమై రాహుల్, సత్యనారాయణల మధ్య గొడవ ప్రారంభమైంది. పాతకక్షలు తోడై రాహుల్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. విషయం శ్రీనివాస్‌కు చెప్పి.. పథకం వేశారు. మద్యం తాగించి రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.