ETV Bharat / state

నోట్ల కట్టలు కాదు - ఈసారి 'సంచులే', అత్యంత ఖరీదైన ఎన్నికల దిశగా అడుగులు, పోలింగ్​ ఫెస్టివల్​కు ముందే ఓటర్లకు నోట్ల పండుగ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 1:00 PM IST

Money Distribution in Telangana Elections Campaignings : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నోట్ల వరద పారుతోంది. పార్టీలు ధనబలమున్న వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా ఖర్చులో పోటీపడుతున్నారు. ఫలితంగా ఈ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డు సృష్టించబోతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat

Money Distribution in Telangana Elections Campaignings : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సాధారణంగా అభ్యర్థుల గెలుపు వ్యూహంలో అనుచరుల వెన్నుదన్ను, ప్రచారం, సభలు, పోల్‌ మేనేజ్‌మెంట్‌ అనే నాలుగు దశలు ఉంటాయి. వీటిలో కీలక ఘట్టమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌ దశ రాకముందే చాలా నియోజకవర్గాల్లో నోట్ల వరద పారుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డు సృష్టించబోతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఖర్చులో పోటీ పడుతోన్న నేతలు..: పార్టీలు ధనబలమున్న వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా ఖర్చులో పోటీపడుతున్నారు. జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా చూస్తే.. మూడు నాలుగు చోట్ల మాత్రమే సుమారు రూ.70 కోట్ల వరకు పార్టీలు ఖర్చు పెట్టాయని చర్చ జరిగింది. ఈసారి వాటిల్లో ఖర్చు రూ.వంద కోట్లను దాటుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల్లో సగటున రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని.. కొన్నిచోట్ల రూ.50 కోట్ల మార్కును దాడటం ఖాయమని రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు.

Telangana Assembly Elections 2023 : నియోజకవర్గంలో కాస్త బలమున్న నేతలున్నా.. వారి మద్దతు కూడగట్టుకోవాలని పార్టీల నాయకత్వాలు ఆదేశించడంతో అభ్యర్థులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. చోటామోటా నుంచి బడా ప్రజాప్రతినిధుల కొనుగోళ్ల(public Representatives Purchases)కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి నేతలకు ఫిక్స్​డ్‌ ప్యాకేజీలను నిర్ణయించడం ఈసారి కొసమెరుపు. భవిష్యత్తులో పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామనే హామీ అదనం.

Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎక్కడ చూసినా నోట్లకట్టలే.. ఇప్పటి వరకు రూ.168 కోట్లు సీజ్

Funding of Political Parties in Election Campaign : రాష్ట్రంలో కొన్నిచోట్ల సర్పంచులకు రూ.3-5 లక్షలు, కౌన్సిలర్లకు సగటున రూ.5 లక్షలు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లకు రూ.లక్ష నుంచి రెండు లక్షలు, జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, కార్పొరేటర్లు, పురపాలక ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లకు రూ.10-15 లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నారని తెలుస్తోంది. చేరిన వెంటనే 25-50 శాతం వరకు అడ్వాన్సుగా, మిగిలిన డబ్బులను దశల వారీగా ఇచ్చేలా ఒప్పందాలు అవుతున్నాయి. కొందరు అభ్యర్థులు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అయినందున నాయకులకు ప్లాట్లను ఆఫర్‌(Offer plots for Leaders) చేస్తున్నట్లు సమాచారం. జనాల తరలింపు, వారికి భోజనం, తాగునీరు, కొందరికి మద్యం పంపిణీ తప్పడం లేదని చెబుతున్నారు. జనాలను తీసుకొచ్చే వాహనాలకు మధ్యవర్తులు రేట్లను ఫిక్స్‌ చేయడం గమనార్హం. ఎన్ని వాహనాలు అనేదే లెక్క.. ఆ మేరకు చెల్లింపులు ఉంటున్నాయి. ఎన్నికల సభలు మొదలైనప్పటి నుంచి కొందరు వాహనదారులు జనసమీకరణే కార్యక్రమంగా పెట్టుకున్నారు.

తనిఖీల్లో కఠిన వైఖరి అవలంభిస్తోన్న పోలీసులు - 500 కోట్లకు చేరువలో స్వాధీనాల మొత్తం

Political Leader Distributes Liquor and Money : ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అభ్యర్థులు రోజువారీగా గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ చేస్తున్న ప్రచారానికి రూ.లక్షలకు లక్షలు తీస్తున్నారు. తక్కువలో తక్కువ 500 మందితో ర్యాలీలు, పాదయాత్రలు చేస్తున్నారు. వీటిలో తమవెంట వచ్చేవారికి రోజుకు రూ.500-700 వరకు నగదు ఇస్తూనే ఉదయం టిఫిన్‌, రెండుపూటలా భోజనం, తాగునీరు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోడానికి.. కొత్తగా చేర్చుకునేందుకు చేస్తున్న వ్యయం అధిక మొత్తంలో ఉంటుందని సమాచారం. ప్రచార బాధ్యతలు నిర్వర్తించినందుకు.. ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నెల రోజుల్లో 453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Huge Amount of Money Seized in Telangana : పాత రికార్డులన్నీ ఢమాల్​.. పోలీసుల తనిఖీల్లో రూ.243 కోట్లు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.