చెక్‌బౌన్స్ కేసులో మోహన్ బాబుకు బెయిల్ మంజూరైంది. ధర్మాసనం తీర్పు మేరకు ఆమేరకు సొమ్మును చెల్లించేందుకు సమ్మతి తెలిపారు. కాకపోతే ఆ డబ్బును చెల్లించేందుకు మూడు నెలల సమయం అడిగారు.
మోహన్ బాబుకు కోర్టు శిక్ష
సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణలోని ఎర్రమంజిల్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతోపాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది. 2010లో 40 లక్షల 50 వేల రూపాయల విలువైన చెక్ బౌన్స్ విషయంలో... సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఈ కేసు విషయమై వాదనలు జరిగాయి. చివరికి 41 లక్షల 75 వేల రూపాయలు వైవీఎస్ చౌదరికి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఆ మొత్తంతో పాటు మోహన్ బాబుకు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ మరో 10 వేల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై మోహన్‌బాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మోహన్ బాబు స్పందన
Just heard about the false news propaganda by a few TV networks. Much to their disappointment, I am at my home in Hyderabad.
— Mohan Babu M (@themohanbabu) April 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just heard about the false news propaganda by a few TV networks. Much to their disappointment, I am at my home in Hyderabad.
— Mohan Babu M (@themohanbabu) April 2, 2019Just heard about the false news propaganda by a few TV networks. Much to their disappointment, I am at my home in Hyderabad.
— Mohan Babu M (@themohanbabu) April 2, 2019
చెక్‌బౌన్స్ కేసు, కోర్టు తీర్పుపై మోహన్ బాబు స్పందించారు.``2009లో `సలీమ్` సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్ ఇచ్చాం. `సలీమ్` అనుకున్న స్థాయిలో విజయం సాధించనందున.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు`` అన్నారు.
ఇవీ చదవండి:'నిజామాబాద్ ఎన్నిక వాయిదా వేయాలని విజ్ఞప్తి'