ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపును ప్రజలందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి నిపుణులు చెబుతున్నట్టు 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితి చేయి దాటుతుందన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి లాక్‌డౌన్ నిర్ణయాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వైద్యంలో ప్రథమ స్థానంలో ఉన్న ఇటలీ దేశాన్నే కరోనా అతలాకుతలం చేసిందని.. అలాంటి పరిస్థితులు మనకు రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా ఉన్నాయన్నారు. వైద్య సదుపాయాల మెరుగుకు రూ.15 వేల కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు.
ఇదీ చూడండి : 'జీవోలు విడుదల.. పోలీసులు ఆటంకం కల్గించొద్దు'