హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కా.యి. దాదాపు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్(MMTS) సేవలు అందుబాటులోకి వచ్చాయి. 10 రైళ్లు సేవలు అందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే(south central railway) ప్రకటించింది. ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గం. వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. జంట నగరాల్లోని 42 స్టేషన్లలో సేవలు అందిస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది.
గతంలో సీజనల్ పాసులు, నెలవారీ పాసులు తీసుకున్న ప్రయాణికుల పాసుల గడువును పెంచుతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. నగదు రహిత చెల్లింపులు చేసే వినియోగదారులకు మూడు శాతం బోనస్‌ను ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటైజర్లు వెంట ఉంచుకోవాలని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భౌతికదూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు :
- ఫలక్‌నుమా-లింగంపల్లి సర్వీస్ ఉదయం 7.50కి ఫలక్‌నుమా నుంచి బయల్దేరి, 9.07 గంటలకు లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు ఉదయం 8.20కి చేరుకుని, 8.22 గంటలకు తిరిగి బయల్దేరుతుంది.
- లింగంపల్లి-ఫలక్‌నుమా సర్వీస్ ఉదయం 9.20కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 10.42కి ఫలక్‌నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 10.10కి చేరుకుని, 10.12గంటలకు తిరిగి బయల్దేరుతుంది.
- ఫలక్‌నుమా-లింగంపల్లి సర్వీస్ ఉదయం 10.55కి ఫలక్‌నుమా నుంచి బయల్దేరి, 12.20కి లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 11.30కి చేరుకుని, 11.32 గంటలకు తిరిగి బయల్దేరుతుంది.
- లింగంపల్లి-ఫలక్‌నుమా సర్వీస్ మధ్యాహ్నం 12.40కి లింగంపల్లి నుంచి బయల్దేరి 2 గంటలకు ఫలక్‌నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 1.25కి చేరుకుని, తిరిగి 1.27 గంటలకు బయల్దేరుతుంది.
- ఫలక్‌నుమా-లింగంపల్లి సర్వీస్ సాయంత్రం 4.20కి ఫలక్‌నుమా నుంచి బయల్దేరి, 5.45కి లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 4.55కు చేరుకుని, తిరిగి 4.57గంటలకు బయల్దేరుతుంది.
- లింగంపల్లి-ఫలక్‌నుమా సర్వీస్ సాయంత్రం 6.05కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 7.32కి ఫలక్‌నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 6.50కు చేరుకుని, తిరిగి 6.52 గంటలకు బయల్దేరుతుంది.
- లింగంపల్లి-హైదరాబాద్ సర్వీస్ ఉదయం 8.43కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 9.28 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
- హైదరాబాద్-లింగంపల్లి సర్వీస్ ఉదయం 9.36కి హైదరాబాద్ నుంచి బయల్దేరి, 10.21 గంటలకు లింగంపల్లి చేరుతుంది.
- లింగంపల్లి-హైదరాబాద్ సర్వీస్ సాయంత్రం 5.15కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 6.05గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
- హైదరాబాద్-లింగంపల్లి సర్వీస్ సాయంత్రం 6.15కి హైదరాబాద్ నుంచి బయల్దేరి, రాత్రి 7.05 గంటలకు లింగంపల్లి చేరుతుంది.
సుదీర్ఘ కాలం తర్వాత ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది మార్చి 23న నిలిచిన ఎంఎంటీఎస్(MMTS) సేవలను.. నేటి నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా సర్వీసులు పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు గతేడాది... మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా లాక్డౌన్(Lockdown) దెబ్బకు 15 నెలలుగా షెడ్డుకే పరిమితం కాగా... కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి(జూన్ 23) పునరుద్ధరిస్తున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలోమీటర్ల సికింద్రాబాద్-ఫలక్‌నుమా సెక్షన్ ఫిబ్రవరి 2014లో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 42 స్టేషన్లలో ఎంఎంటీఎస్(MMTS) రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రారంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు 13వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ ప్రస్తుతం 121 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే(south central railway) అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదీ చూడండి: engineering: ఇంజినీరింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌కు స్వస్తి