ETV Bharat / state

Mlc Venkatramireddy: బేషరతు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి - తెలంగాణ వార్తలు

Mlc Venkatramireddy: హైకోర్టుకు సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బేషరతు క్షమాపణ తెలిపారు. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న వివాదంలో ఆయన క్షమాపణలు చెప్పారు.

Venkatramireddy
Venkatramireddy
author img

By

Published : Apr 4, 2022, 9:28 PM IST

Mlc Venkatramireddy: కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న వివాదంలో సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బేషరతు క్షమాపణ తెలిపారు. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని... సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఉత్తర్వులను తెచ్చుకున్నా... పట్టించుకోమని సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారని అభియోగం. వెంకట్రామిరెడ్డి లిఖితపూర్వకంగా బేషరతు క్షమాపణ చెబుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులపై తనకు అపార గౌరవం ఉందని.. న్యాయస్థానాలకు కించపరిచే ఉద్దేశం లేదన్నారు.

ఎడిట్ చేసిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి బేషరతు క్షమాపణను పరిగణనలోకి తీసున్న సీజే జస్టిస్ సతీశ్‌ చంద్రశర్మ ధర్మాసనం ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ ముగించింది.

ఇదీ చదవండి: పీయూష్‌ గోయల్‌పై ప్రివిలేజ్​ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.