ETV Bharat / state

'గవర్నరే కాదు హైకోర్టు సైతం ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది'

తెరాస నేతలపై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు మండిపడ్డారు. గవర్నర్​ను భాజపా అధ్యక్షులుగా తెరాస ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంపై తీవ్రంగా ఖండించారు.

mlc ramachadrarao fire on trs leaders in hyderabad
'గవర్నరే కాదు హైకోర్టు సైతం ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది'
author img

By

Published : Aug 19, 2020, 6:07 PM IST

Updated : Aug 19, 2020, 6:45 PM IST

రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న గవర్నర్​ను భాజపా అధ్యక్షులుగా తెరాస ఎమ్మెల్యే వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్సీ రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ఆయన అభిప్రాయమా లేక తెరాసదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఉన్న గవర్నర్​ను ఎలా చూశారు.. ఈ గవర్నర్​ను ఎలా చూస్తున్నారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్​పై ఇలా ఆరోపణలు చేసే నవ్వుల పాలయ్యారని గుర్తు చేశారు. గవర్నరే కాదు హైకోర్టు సైతం ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందని తెలిపారు.

గవర్నర్ నిమ్స్​కు వెళ్లడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి నివేదికలు తెప్పించుకున్న తరువాతే స్పందించారని చెప్పారు. తప్పు ప్రభుత్వంపై పెట్టుకొని గవర్నర్ వ్యాఖ్యలపై రాజకీయాలు చేయాలని తెరాస చూస్తుందని మండిపడ్డారు.

ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

Last Updated : Aug 19, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.