Mlc Kavitha Tweet: ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను రాహుల్‌గాంధీలా నియోజకవర్గాన్ని వదిలి పారిపోలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్, తెరాస నాయకుల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఈ సందర్భంగా తనపై ట్వీట్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న దురహంకారం వల్లే పార్టీ రెండంకెల సీట్లకు చేరుకుందని ఎత్తిచూపారు. ఎన్నికల్లో రాహుల్‌గాంధీ మాదిరిగా తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయలేదని కూడా చెప్పారు.
'ఒక దేశం- ఒకే సేకరణ విధానం' అని తెరాస డిమాండ్ చేస్తున్నట్లు కవిత వివరించారు. దీనిపై రాహుల్‌గాంధీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. తెరాస ఎల్లప్పుడు రైతులతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వరిని సేకరించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు.
-
Dear @manickamtagore ji, this arrogance reduced your party into double digits in the same parliament. Win or loose, I did not run away from my constituency like your ex CP @RahulGandhi ji did. Also, I did not contest 2 seats like your ex-CP 1/2 https://t.co/RysXVZhIFN
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear @manickamtagore ji, this arrogance reduced your party into double digits in the same parliament. Win or loose, I did not run away from my constituency like your ex CP @RahulGandhi ji did. Also, I did not contest 2 seats like your ex-CP 1/2 https://t.co/RysXVZhIFN
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022Dear @manickamtagore ji, this arrogance reduced your party into double digits in the same parliament. Win or loose, I did not run away from my constituency like your ex CP @RahulGandhi ji did. Also, I did not contest 2 seats like your ex-CP 1/2 https://t.co/RysXVZhIFN
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
మానిక్కం ఠాగూర్ సైటైర్లు: అంతకముందు రాహుల్‌గాంధీని ట్యాగ్ చేస్తూ కవిత చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎంపీలకు పార్లమెంట్ లోపలికి అనుమతి ఉండదని కవితను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తెరాస ఎంపీలు డోక్లా, బిర్యానీ రుచి గురించి మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2021 ఆగస్టులో సంతకం ఎవరు చేశారో మర్చిపోవద్దని చురకలంటించారు. తెలంగాణ రైతుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి: Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్.. కవిత కౌంటర్