కరోనా విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసనమండలిలో కోరారు. వైరస్ పట్ల రోజు రోజుకూ ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ముందస్తు చర్యల్లో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలు, పబ్లిక్ మీటింగ్‌లను మూసివేయాలని సూచించారు.
కరోనాను అరికట్టేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనేక చర్యలు తీసుకుంటున్నా.. అవి సరిపోవడంలేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పారాసెటమాల్ మాత్రతో కరోనా తగ్గదన్నారు. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇదీ చూడండి: కరోనాపై కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ భేటీ