ETV Bharat / state

సీఎం కేసీఆర్.. జగన్​ను చూసి నేర్చుకో: జీవన్​ రెడ్డి - తెరాస ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం

ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యంతర భృతి ఇచ్చారని... తెలంగాణలో మాత్రం 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నవాడైన జగన్​ను చూసి నేర్చుకోమంటూ కేసీఆర్​కు హితవు పలికారు.

mlc jeevan reddy fires on trs
'సీఎం కేసీఆర్.. చిన్న పిల్లగాన్ని చూసుకో నేర్చుకో..'
author img

By

Published : Feb 19, 2020, 1:19 PM IST

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్వోగులను తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. తెరాస హయాంలోకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ గ్రూప్​-1 నోటిఫికేషన్ వేయకపోవడం చాలా బాధకరమని తెలిపారు.

ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యంతర భృతి ఇచ్చారని... ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఏపీలో ఉందని తెలిపారు. వయసులో చిన్నవాడైన జగన్​ను చూసి నేర్చుకోమంటూ సీఎం కేసీఆర్​ను విమర్శించారు. ఉద్యోగుల సంఘం నాయకుడు పేరు మీదే శ్రీనివాస్ గౌడ్​కు మంత్రి పదవి వచ్చిందని... ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల పక్షాన నిలబడకపోతె శ్రీనివాస్ గౌడ్​కు మంత్రి పదవెందుకంటూ ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని.. కేసీఆర్ ఇప్పటికైనా పీఆర్​సీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్.. జగన్​ను చూసి నేర్చుకో: జీవన్​ రెడ్డి

ఇవీ చూడండి: మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.