గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికల ఇంఛార్జిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియమించారు. ఈయనకు సహాయకారిగా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు చేయించే ప్రక్రియను పర్యవేక్షించడం, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే అందిన దరఖాస్తుల పరిశీలన, వడపోత పోసి ప్రత్యేకంగా ఓ జాబితా సిద్దం చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాలు రచించడం లాంటివి జీవన్ రెడ్డి పరిధిలో జరుగుతాయని ఉత్తమ్ స్పష్టం చేశారు.