రాష్ట్రంలో అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోందని... అవినీతి రహిత తెలంగాణగా తీర్చిదిద్దే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ భూ వివాదం విషయంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన రెవెన్యూ, పోలీస్ అధికారులు చిక్కారు. ఈ తీరుతో ప్రభుత్వం అవినీతిమయంగా మారినట్లనిపిస్తోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ భూముల అక్రమణ, భూ దందాలు ఇష్టారీతిగా సాగుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టిస్తూ.. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తోన్న కబ్జాదారులకు... అధికారులు సహకరిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ విషయంలో పలుమార్లు అసెంబ్లీ, కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
- ఎమ్మెల్యే రాజాసింగ్
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ