పాటలు పాడుతూ... వీడియోలు చూపిస్తూ నర్సుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులు అసలు మనుషులేనా అని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. దేవుడికి ప్రతిరూపమైన డాక్టర్లపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడిని నిరసిస్తూ డాక్టర్లు కరోనా బాధితులను పట్టించుకోకపోతే తెలంగాణలో ఒక్కరూ మిగలరన్నారు. ఇష్టానుసారంగా వ్యవహారించే వ్యక్తులను అడవిలో వదిలి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓవైసీ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు... మీ వాళ్లకు ఇలాంటివి చేయవద్దని చెప్పమంటూ రాజాసింగ్ హితవు పలికారు.
డాక్టర్లు పట్టించుకోకపోతే ఒక్కరూ మిగలరు: రాజాసింగ్ - భాజపా
గాంధీ ఆసుపత్రిలో వైద్యులు కరోనా బాధితుల కోసం రాత్రింబవళ్లు కష్టపడి వైద్యం చేస్తుంటే... వాళ్లపైన దాడి చేయడం సరైన పద్ధతి కాదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.