Rajasingh came to the Assembly on a bike: శాసన సభ సమావేశాల్లో పాల్గొనేందుకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ద్విచక్ర వాహనంపై అసెంబ్లీకి వచ్చారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పదే పదే మోరాయించడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆ వాహనాన్ని పోలీసులకు ఆయన అప్పగించారు. దీంతో అసెంబ్లీకి బుల్లెట్టు బండిపై వచ్చారు.
శుక్రవారం ఇలానే మొరాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎప్పటికప్పుడు మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వాహనం ఎక్కడబడితే అక్కడే ఆగిపోతోందని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్‌ను పంజాగుట్ట పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఆయనను పోలీసులు అసెంబ్లీకి తరలించారు. ఆ తరువాత ప్రధాన గేట్ వద్ద నుంచి రాజాసింగ్ నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లారు.
ఇవీ చదవండి: