ETV Bharat / state

గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు:రఘునందన్‌ రావు

MLA Raghunandan comments on Governor Speech in TS Assembly : రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. కానీ గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదని అన్నారు.పేదలకు రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్నారని..ఇప్పటి వరకు ఎంతమందికి రెండు పడకల గదుల ఇళ్లు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సమదృష్టితో చూడాలని కోరారు.

Raghunandan Rao
Raghunandan Rao
author img

By

Published : Feb 4, 2023, 1:29 PM IST

Updated : Feb 4, 2023, 3:56 PM IST

MLA Raghunandan comments on Governor Speech in TS Assembly : గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ వీడి అంత సాఫీగా సాగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. కేబినెట్ రాసి ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదివారని పేర్కొన్నారు. దీనిపై శాపనార్థాలు పెట్టేలా మాట్లాడడం తగదని సూచించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కేంద్రం సహకరిస్తోందని వివరించారు. వైద్య కళాశాలల విషయంలో కేంద్రాన్ని విమర్శించడం తగదని రఘనందన్ రావు హితపు పలికారు.

MLA Raghunandan speech in TS Budget Sessions 2023 : ఎస్‌డీఎఫ్ నిధులు ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం ఇస్తే బాగుంటుందని రఘునందన్‌ రావు డిమాండ్ చేశారు. తన జిల్లాలో గజ్వేల్, సిద్దిపేటకు మాత్రమే ఎస్‌డీఎఫ్ నిధులు ఇస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ ప్రజలు తమ పైసలు తమకే కావాలంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని వివరించారు.

అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సమదృష్టితో చూడాలి: పేదలకు రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్నారని.. ఇప్పటి వరకు ఎంతమందికి రెండు పడకల గదుల ఇళ్లు ఇచ్చారని రఘనందన్ రావు ప్రశ్నించారు. గవర్నర్‌ ప్రసంగంలో హైదరాబాద్‌లోని లక్ష రెండు పడకల గదుల ఇళ్ల ప్రస్తావన రాలేదని పేర్కొన్నారు. సొంత ఇంటి కోసం ఆర్థికసాయం రూ.7.5 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సమదృష్టితో చూడాలని కోరుతున్నానని రఘనందన్ రావు అన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయాలి: రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయాలని రఘనందన్ రావు పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థల సమస్యను పరిష్కరిస్తే కేంద్రం త్వరగా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని వివరించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై పార్లమెంట్ వేదికగా చర్చ జరిగితే బాగుంటుందని అన్నారు. మరోవైపు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.

నియామక విధానాల్లో సవరణలు చేయాలని రఘనందన్ రావు కోరారు .317 జీఓ వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని.. వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. గొల్ల కురుమలు డీడీలు కట్టి గొర్రెలు వస్తాయని ఎదురు చూస్తున్నారని వివరించారు. గత బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,800 కోట్లు కేటాయించారని రఘనందన్ రావు గుర్తు చేశారు.

"గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ వీడి అంత సాఫీగా సాగింది. కేబినెట్ రాసి ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదివారు. శాపనార్థాలు పెట్టేలా మాట్లాడడం తగదు. తెలంగాణకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కేంద్రం సహకరిస్తోంది. వైద్య కళాశాలల విషయంలో కేంద్రాన్ని విమర్శించడం తగదు. ఎస్‌డీఎఫ్ నిధులు ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం ఇస్తే బాగుంటుంది." - రఘునందన్‌ రావు, బీజేపీ ఎమ్మెల్యే

గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు:రఘునందన్‌ రావు

ఇవీ చదవండి: 6న రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన కేసీఆర్

'గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలు మిస్.. ఎవరు తొలగించారు..?'

వివాహాల్లో లెహంగాలు నిషేధం.. పెళ్లి బరాత్​లు బంద్! ఆహారం ఇంటికి తీసుకెళ్తే రూ.30వేల ఫైన్

Last Updated : Feb 4, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.