ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు - MLAs Poaching Case Updates

mlas poaching case updates
mlas poaching case updates
author img

By

Published : Dec 1, 2022, 11:49 AM IST

Updated : Dec 1, 2022, 5:36 PM IST

11:46 December 01

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

MLAs Poaching Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ముగ్గురికి షరతులతో బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఎట్టిపరిస్థితుల్లో దర్యాప్తును ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు వినిపించిన నిందితుల తరఫు న్యాయవాది.. నిందితులు ఇప్పటికే నెల రోజులకు పైగా జైలులో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

సుప్రీంకోర్టు సైతం బెయిల్‌ ఇవ్వొచ్చని అభిప్రాయపడిన విషయాన్ని కోర్టుకి వివరించారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌ను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టినట్లు.. నిందితుల తరఫు న్యాయవాది రవి చందర్ వాదించారు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకుని.. హైకోర్టు నిందితులకు రిమాండ్ విధించిందన్న సుప్రీంకోర్టు మాటలని నిందితుల తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు: ఆ సమయంలో జోక్యం చేసుకున్న పోలీసుల తరఫు న్యాయవాది.. నిందితులకు బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కీలక దశలో ఉందని వివరించారు. ఈ సమయంలో నిందితులకు బెయిల్‌మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని కోరారు. అయితే నిందితుల తరఫు వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. అందుకు కొన్ని షరతులు పెట్టింది. మూడు లక్షల రూపాయలతో పాటు ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

నందకుమార్‌పై ఐదు కేసులు: ప్రతి సోమవారం సిట్ అధికారి ఎదుట విచారణకు హాజరుకావడం సహా.. పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారి వద్ద డిపాజిట్ చేయాలని షరతు విధించింది. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. దక్కన్ కిచెన్‌లీజు, బెదిరింపులు విషయంలో వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. లీజు విషయంలో పోలీసులు నందకుమార్‌ని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో బెయిల్ మంజూరైతే జైలునుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది.

రామచంద్ర భారతిపై రెండు కేసులు: మరో నిందితుడు రామచంద్ర భారతిపైనా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. నకిలీ పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను గుర్తించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్ర భారతి ల్యాప్​టాప్ పరిశీలించినప్పుడు సిట్ అధికారులు రెండు పాస్​పోర్టులను గుర్తించారు. ఒకే పేరుతో రెండు పాస్​పోర్టులు ఉన్న విషయాన్ని బంజారాహిల్స్ పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఆయనపై మరో కేసు నమోదయింది. ఎమ్మెల్యే ఎర కేసులో రామచంద్ర భారతి.. బెయిల్‌పై బయటకి రాగానే బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదయిన కేసులో అదపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ అధికారుల కౌంటర్.. అందులో ఏముందంటే..

జైలులో పెడతారా పెట్టుకోండి.. దేనికైనా సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

హిందూ సంప్రదాయం ప్రకారం 30 జంటలకు వివాహం.. ముస్లిం నేత ఆదర్శం!

Last Updated : Dec 1, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.