ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల పాటు ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ తన నివాసంలోని పూలకుండీల్లోని చెత్తను తొలగించారు.
దోమల వ్యాప్తిని అరికట్టడం, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ప్రజలందరూ కలిసి సమైక్యంగా దోమలపై పోరాటం చేయాలని సూచించారు.