రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పష్టం చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభించారు. గాంధీ నగర్, బోలక్ పూర్, ముషీరాబాద్, అడిక్మెట్, కవాడిగూడ డివిజన్లలోని రేషన్ దుకాణాల్లో ఆయన ప్రారంభించారు.
పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ మచ్చ కుర్తి ప్రభాకర్, తెరాస నాయకులు సత్యనారాయణ, గుండు జగదీష్, భాస్కర్, ముచ్చ కుర్తి పద్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా