ఆర్టీసీ క్రాస్రోడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్ రోడ్డు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా రాంనగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నాణ్యత, నిర్మాణ పనుల తీరు తెన్నులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2022 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ లైన్, విద్యుత్ కోతల కారణంగా అవాంతరాలు ఏర్పడుతున్నాయని... వాటిని అధిగమిస్తు పనులు కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: లౌకికవాదాన్ని అణచివేసేందుకు భాజపా కుట్ర: సీపీఐ నారాయణ