తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దృష్టిలో ఉంచుకొని సురభి వాణీ దేవికి ఓటు వేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆమెను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సభలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు చేసిందేమీ లేదని విమర్శించారు.
ప్రస్తుతం తెరాస అభ్యర్థిని గెలిపించుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన కేసీఆర్‌కు ఈ విజయం కానుకగా ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: చట్టసభల్లో గొంతెత్తే అవకాశం ఇవ్వండి: రాములు నాయక్