కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం కోసం..
ఫతేనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన..ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తెలిపిన ఎమ్మెల్యే.. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తానన్నారు.
అభివృద్ధిలో భాగంగా ..
అభివృద్ధిలో భాగంగా ఫతేనగర్ డివిజన్లో రూ. 55 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్, పాండు కాలనీ, శివ శంకర్ నగర్, పిట్టల బస్తీతో పాటు.. ఇందిరాపురం కాలనీ, దీన్‌దయాళ్ కాలనీ, భరత్ నగర్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి:ఇద్దరి దారుణహత్య: బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు!