కేంద్ర విద్యుత్ సవవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ తీసుకున్న వైఖరి పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ బిల్లును ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. పవర్‌తో పెట్టుకున్నోళ్లు పవర్ లేకుండా పోయారని గుర్తుచేశారు.
కేంద్రీకృత విద్యుత్ చట్టంపై మోదీ చూపిన శ్రద్ధ వలస కార్మికులపై చూపలేకపోయారని ఆరోపించారు. వలస కూలీల ఉసురు మోదీకి తగులుతుందన్నారు. కేసీఆర్ ఉచిత విద్యుత్ విధానం దేశానికే ఆదర్శమని కొనియాడారు. భాజపా నేతలకు దమ్ముంటే పసుపుబోర్డు తేవాలని సవాల్ చేశారు. నిజామాబాద్ ఎంపీ బోగస్ డిగ్రీ తెచ్చుకున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు విద్యుత్ బిల్లుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. థర్డ్ క్లాస్ విషయాలపైనే కాంగ్రెస్ నేతలు మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జ్ఞాపకశక్తి తగ్గుతుందా... ఓ సారి ఇది ట్రై చేయండి!