దిల్లీ వెళ్లి ఎవ్వరికి పీసీసీ ఇవ్వాలో అధిష్ఠానంకు ముందే వెల్లడిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధినేతకు లేఖ రాస్తానని వెల్లడించారు. తాను మాట్లాడిన మాటలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బంది కలిగించొచ్చని, అందుకే తనను మందలించినట్లు తెలిపారు. తెలంగాణ-కాంగ్రెస్‌లో పీసీసీ పంచాయితీలు మాములేనని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్ష పదవి గురించి తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.
మొన్న మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తెరాసలో కేసీఆర్‌దే తుది నిర్ణయం-కాంగ్రెస్‌లో అలా కాదన్నారు. ఇప్పట్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డిని పీసీసీ నుంచి ఇప్పుడు తొలగిస్తారని తానూ అనుకోనని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మందలిస్తే నేను ఎమీ ఇబ్బందికి గురికానని స్పష్టం చేశారు. తాను మాట్లాడినంత స్వేచ్ఛగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలేరన్నారు.
ఇదీ చూడండి : రైతుల పట్ల అదనపు కలెక్టర్ దురుసు ప్రవర్తన