ETV Bharat / state

MLA Jagga Reddy comments on DGP: 'కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్​కేనా.. భాజపాకు వర్తించవా?'

MLA Jagga Reddy comments on DGP: కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్​కు మాత్రమేనా... భాజపాకు వర్తించవా అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆర్​ఎస్ఎస్ సమావేశాలకు అనుమతులు ఇచ్చిన పోలీసులు... కాంగ్రెస్​కు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

MLA Jagga Reddy comments on DGP, jagga reddy about trs and bjp
'కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్​కేనా.. భాజపాకు వర్తించవా?'
author img

By

Published : Jan 7, 2022, 3:49 PM IST

MLA Jagga Reddy comments on DGP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల శిక్షణ తరగతులకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తప్పుపట్టారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ కూడా స్పందించారు. ఇదే అంశంపై స్పందించిన జగ్గారెడ్డి... పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ ట్వీట్ చేసినట్లు... భాజపాకు వర్తించని కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్​ మాత్రమే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.

ఏఐసీసీ ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి కోసం దరఖాస్తులు చేశాం. కానీ ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని మాణికం తెలిపారు. అయితే ఆర్​ఎస్ఎస్ శిక్షణా తరగతుల కోసం పర్మిషన్ ఇచ్చిన పోలీసులు... కాంగ్రెస్​కు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం ఇదేనా?

-జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

డీజీపీ స్పందించాలి..

కొవిడ్ నిబంధనలకు లోబడే తాము శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్న జగ్గారెడ్డి... కాంగ్రెస్​కు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం లేదని అనుమతి ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ సంఖ్య 150 కాగా... ఆర్ఎస్ఎస్ సంఖ్య 300 మందికి పైగా హాజరయ్యారన్నారు. పైగా వాళ్లు ఎక్కడా కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఠాగూర్ ట్వీట్ పై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​ పార్టీ మూడు రోజుల శిక్షణా తరగతుల కోసం కొవిడ్ అంటున్నారు. మరి ఆర్​ఎస్ఎస్​కు నిబంధనలు లేవా? వాళ్లకు ఇచ్చిన పర్మిషన్.. మాకెందుకు ఇవ్వడం లేదు?. డీజీపీ సమాధానం చెప్పాలి. ఆర్​ఎస్ఎస్ వాళ్లు 300 మంది. కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో కేవలం 150 మంది మాత్రమే. మేం పక్కాగా కరోనా నిబంధనలు పాటిస్తామని చెప్పినా... అనుమతులు ఇవ్వడం లేదు. తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఆర్ఎస్​ఎస్ వాళ్ల వీడియోలు కొన్ని చూశాం. వాళ్లు ఎక్కడా కూడా కరోనా నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపించడం లేదు.

-జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

మాణికం ట్వీట్

ఇదే విషయంపై ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ మాణికం ఠాగూర్ ట్విటర్​ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతుల్లో 300 మంది పాల్గొంటుంటే అనుమతి ఇవ్వడంతోపాటు ప్రొటెక్షన్ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో కేవలం 150మంది మాత్రమే పాల్గొంటారని... అయినా అనుమతి ఇవ్వలేదని ఠాగూర్ ఆరోపించారు.

ఇదీ చదవండి: internal disputes in congress : రాష్ట్ర కాంగ్రెస్​లో నేతల మధ్య కొరవడిన సఖ్యత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.