ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.3లో ఆయన మొక్కలు నాటారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు, సినీ నిర్మాత దిల్ రాజు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీలకు దానం గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానంతో పాటు వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నే కవిత, బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది, స్కూల్ చిన్నారులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన