ETV Bharat / state

అభ్యర్థుల నేరచరిత్రను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్న పార్టీలు - Criminal history candidates contesting elections

MLA Candidates Criminal Record Telangana 2023 : నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు వాటి వివరాలను పత్రికలు, టీవీల్లో విధిగా ప్రకటించాల్సిందే. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువుల్లో మూడు దఫాలుగా అభ్యర్థులు ఇచ్చే ఈ ప్రకటనల వ్యయాన్ని కూడా ఎన్నికల ఖర్చు కిందే పరిగణిస్తారు. అటు రాజకీయ పార్టీలు కూడా సదరు అభ్యర్థుల వివరాలను పొందుపర్చడంతో పాటు వారినే ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో కూడా ప్రకటించాల్సిందే. పార్టీలు కూడా ప్రకటనలు ఇవ్వడంతో పాటు వారి సామాజిక మాధ్యమ ఖాతాల్లో తప్పనిసరిగా పొందుపర్చాలి.

Candidates Criminal Cases Announcement
Candidates Criminal Cases Announcement
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 9:34 AM IST

అభ్యర్థుల నేరచరిత్రను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్న పార్టీలు

MLA Candidates Criminal Record Telangana 2023 : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండే నేరచరిత్ర గురించి ఎన్నోమార్లు చర్చ జరుగుతుంటోంది. పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికైన అభ్యర్థుల నేరచరిత్ర (Candidates Criminal History), వారిపై ఉన్న కేసులు, తదితర వివరాలను వివిధ సంస్థలు ప్రకటిస్తుంటాయి. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అభ్యర్థులే వారి నేరచరిత్రను స్వయంగా ప్రకటించాల్సి ఉంది. వారితో పాటు వారు ప్రాతినిధ్యం వహించే పార్టీలు కూడా ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది.

MLA Candidates Criminal History in Telangana : ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై ఉన్న కేసులు, గత చరిత్రను ఓటర్లు, ప్రజలకు తెలపాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో దాఖలైన వివిధ పిటిషన్లపై ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 2011లో దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, 2015లో దాఖలైన లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది.

107 Candidates Disqualified From Elections : 107 మంది అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు.. ఆ నియోజకవర్గంలోనే అధికంగా

ఆ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే వారు విధిగా అందుకు సంబంధించిన వివరాలను వార్తా పత్రికలు, టీవీల ద్వారా మూడు సందర్భాల్లో ప్రకటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇవ్వాల్సిన ప్రకటనలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిర్దిష్ట గడువులు విధించింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం నాలుగు రోజుల్లో మొదటి దఫా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.

Telangana MLA Candidates Criminal Record 2023 : ఐదు నుంచి ఎనిమిదో రోజు మధ్య మరో విడత ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. తొమ్మిదో రోజు నుంచి ప్రచారం చివరిరోజు మధ్య మూడో దఫా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రకటనలకు అయ్యే ఖర్చును కూడా సదరు అభ్యర్థి ఎన్నికల వ్యయంలో భాగంగానే పరిగణిస్తారు. అటు రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలను విధిగా ప్రకటించాల్సిందే. సదరు అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, వాటి వివరాలు, తదితరాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పార్టీలు తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.

EC Focus on Critical Constituencies in Telangana : ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్​ ఫోకస్​.. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు

కేసులు, నేరచరిత్ర ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో ఆ కారణాలను కూడా రాజకీయ పార్టీలు తెలపాలి. గెలుపు ప్రాతిపదికన కాకుండా వారికి ఉన్న అర్హతలు, గతంలో సాధించిన విజయాలు.. తదితరాలను పేర్కొనాల్సి ఉంటుంది. పార్టీలు కూడా ఒక ప్రముఖ స్థానిక, ఒక జాతీయ పత్రికలో ఆ వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాలైన ఫేస్ బుక్, ఎక్స్(ట్విటర్) లాంటి వాటిలోనూ ఆ వివరాలను అందుబాటులో ఉంచాలి.

అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోపు, నామినేషన్ల దాఖలు మొదటి రోజుకు రెండు వారాల ముందు ఈ వివరాలను రాజకీయ పార్టీలు ప్రకటించాల్సి ఉంటుంది. ప్రకటనలకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన నివేదికను రాజకీయ పార్టీలు 72 గంటల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది.

నేడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణకు భారీ ఏర్పాట్లు

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.