పవిత్ర రంజాన్ మాసంలో మసీదులలో జరగాల్సిన ప్రత్యేక తరావి నమాజ్ ప్రార్థనలు లాక్డౌన్ కారణంగా మసీదుల్లో జరగకుండా పోయాయి. తరావి నమాజ్ చదివించే హఫీజ్లకు వేతనాలు లేకపోవడం వల్ల వారి పరిస్థితులు దుర్భరంగా మారాయి.
విషయం తెలుసుకున్న చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ బండ్లగూడలోని ఎంఎం కాలనీలో నియోజకవర్గంలో ఉండే 250 మంది హఫీజ్లకు నిత్యావసర సరకులతో పాటు నగదును అందించి వారిని ఆదుకున్నారు. సాలరే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా హఫీజ్లకు నిత్యావసర సరకులు, నగదును అందజేశారు.
ఇవీ చూడండి: గ్రేటర్ పరిధిలో ప్రారంభంకానున్న 45 బస్తీ దవాఖానాలు