లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. వీరి ఆకలి తెలుసుకున్న పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.హైదరాబాద్ మియాపూర్ హఫీజ్‌పేట్ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు మియాపూర్ సీఐ వెంకటేష్ నిత్యావసర వస్తువులను అందజేశారు.
నిత్యావసర వస్తువులతో పాటు అన్నపూర్ణ క్యాంటీన్ సహకారంతో భోజనం అందజేశారు. పీఎస్ ఆవరణలో వలస కూలీలకు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఇవీ చూడండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇబ్బందులా... అయితే ఈ యాప్ మీ కోసమే.