ETV Bharat / state

రూప్​కుంద్ రహస్యాలు బయట పెట్టిన సీసీఎంబీ - misterious roopkhund lake ccmb research

ఓ వైపు ప్రశాంతమైన వాతావరణం... ఎత్తైన శిఖరాలు.... మరోవైపు చెల్లా చెదురుగా పడి ఉన్న మానవ కళేబరాలు. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఎముకలు, పుర్రెలు. ఆ సరస్సు చుట్టు పక్కలే కాదు... సరస్సు అంతరాల్లోనూ అవే దర్శమిస్తాయి. అదే ఉత్తరాఖండ్​లోని మిస్టీరియస్ లేక్ ... రూప్​కుంద్. ఎముకల సరస్సుగా పిలిచే ఈ ప్రాంతం కేవలం ఏడాదిలో ఒక్క నెల మాత్రమే మంచు కరిగి సరస్సుగా దర్శనమిస్తుంది. మరి అలాంటి ప్రాంతంలోకి పుర్రెలు, ఎముకలు ఎలా వచ్చాయో సీసీఎంబీ గుర్తించింది.

రూప్​కుంద్ రహస్యాలు బయట పెట్టిన సీసీఎంబీ
author img

By

Published : Aug 25, 2019, 8:04 PM IST

Updated : Aug 26, 2019, 10:22 AM IST

కొందరికి ఆధ్యాత్మిక ప్రాంతం, మరికొందరికి పర్యటక క్రేజ్ ... ఏది ఏమైనా అది ఓ మిస్టీరియస్ ప్రాంతమనే చెప్పాలి. హిమాలయాల్లో సముద్రమట్టానికి దాదాపు 5వేల మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం రూప్​కుంద్​ సరస్సు. ఉత్తరాఖండ్ ప్రజలు ఎక్కువగా కొలిచే నందా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో దర్శనమిస్తుంది. ఏడాదిలో 11 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతం కేవలం ఒక్క నెల రోజులు మాత్రమే మంచు కరిగి సరస్సుగా కనిపిస్తుంది. అలాంటి ప్రాంతంలో ఎటు చూసినా పుర్రెలు, మానవ కళేబరాలే దర్శనమిస్తుంటాయి.

500 మంది

సుమారు 500 మంది వరకు ఇక్కడ మరణించి ఉంటారని ఓ అంచనా. ఇప్పటి వరకు ఈ కళేబరాలకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉండేవి. దీనిపై గత పదేళ్లుగా సీసీఎంబీ పరిశోధనలు చేస్తోంది. అనేక డీఎన్​ఏ పరీక్షల అనంతరం ఇటీవల అత్యంత విలువైన సమాచారాన్ని గుర్తించింది. రూప్​కుంద్ నుంచి 72 ఎముకలను సేకరించిన సీసీఎంబీ హార్వర్డ్ మెడికల్ స్కూల్, జర్మనీకి చెందిన మరో సంస్థ, భారత్​లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, డెక్కన్ కాలేజీ పుణే, బీర్బల్ సెతానీ ఇన్​స్టిట్యూట్ లఖ్​నవూతో కలిసి అనేక పరిశోధనలు చేసింది.

19వ దశాబ్దంలో

ఎన్షియంట్ డీఎన్​ఏని ఆయా ఎముకల నుంచి సేకరిచింది. వాటికి కార్బన్ డేట్ ఎనాలిసిస్​తోపాటు డీఎన్​ఏ పరీక్షలు చేశారు. ఆ ఎముకలు ఒక ప్రాంతానికో లేక ఒక తెగకో చెందిన వారివి కాదని గుర్తించింది. ఇక ఈ 72 ఎముకల్లో స్త్రీ పురుషులవి ఉన్నాయని స్పష్టం చేసింది. ఇందులో కొందరు భారత్​కు చెందిన వారు కాగా... మరికొందరు గ్రీక్​, చైనీస్, ఇరాయని తెగలకు చెందిన వారని గుర్తించింది. కార్బన్ డేట్ ఎనాలిసిస్ చేసిన సీసీఎంబీ భారత్​కు చెందిన వారు సుమారు 7 నుంచి 9 దశాబ్దాల మధ్య ఇక్కడ చనిపోగా, మిగతా వారు సుమారు 19వ దశాబ్దంలో ఇక్కడకి వచ్చారని పేర్కొంది.

అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్

అక్కడ లభించిన ఆధారాలు, డీఎన్​ఏ పరీక్షలు చేసిన సీసీఎంబీ.. వారంతా నందాదేవి దర్శనానికి లేక పర్యాటకానికి వచ్చిన వారై ఉంటారని పేర్కొంది. ఈ మేరకు సీసీఎంబీ శాస్త్రవేత్త తంగరాజ్ రాసిన ఆర్టికల్ అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్​లో ప్రచురితం కావటం విశేషం. త్వరలో రూప్​కుంద్​లోని అన్ని ఎముకల డీఎన్​ఏలపై పరిశోధన చేసే దిశగా కృషి చేసి.. రహస్యాన్ని ఛేదిస్తామంటున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు.

దశాబ్దాల నుంచి మిస్టరీగా మారిన రూప్​కుంద్ సరస్సుపై సీసీఎంబీ జరిపిన పరిశోధనలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందనే చెప్పాలి.

రూప్​కుంద్ రహస్యాలు బయట పెట్టిన సీసీఎంబీ

ఇదీ చదవండిః చెక్​డ్యామ్ నిర్మాణంతో పెరగనున్న భూగర్భజలాలు

Last Updated : Aug 26, 2019, 10:22 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.