ETV Bharat / state

ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో ఏపీ పరిశ్రమల శాఖ సంప్రదింపులు

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను గ్రీన్‌ కేటగిరీలోకి (పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమగా) మార్చేందుకు వీలుగా సంస్థ యాజమాన్యంతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

vsp sterain
vsp sterain
author img

By

Published : Jun 1, 2020, 7:50 AM IST

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను గ్రీన్‌ కేటగిరీలోకి (పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమగా) మార్చేందుకు వీలుగా సంస్థ యాజమాన్యంతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. అక్కడ స్టైరీన్‌ లేదా ప్రమాదకర రసాయనాలతో సంబంధం ఉన్న ఎలాంటి ఉత్పత్తులూ తయారు చేయకుండా వేరే ఏదైనా ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా చేస్తే తప్ప అక్కడ యూనిట్‌ను ప్రారంభించడం సాధ్యం కాదని ఆ శాఖ భావిస్తోంది. ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7న గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ విభాగం జారీచేసిన సూచనలు పాటిస్తే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని అధికారులు భావిస్తున్నారు. దీనికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. దుర్ఘటనపై విచారణకు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ కూడా ఫ్యాక్టరీస్‌ విభాగం నివేదికను కీలకంగా భావిస్తోంది.

డిసెంబరులోనే లోపాల గుర్తింపు

వార్షిక తనిఖీల్లో భాగంగా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ విభాగం అధికారులు గత ఏడాది డిసెంబరులో ఎల్‌జీ పరిశ్రమను పరిశీలించారు. స్టైరీన్‌ ట్యాంకు దగ్గర ఉన్న పైపులు కొన్ని దశాబ్దాల నాటివని, అవి పాడైపోయాయని గుర్తించి.. వాటిని తక్షణం మార్చాలని సూచించారు. నివేదిక ఇచ్చిన నాలుగు నెలల తర్వాత కూడా పాత పైపులతోనే పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. నిజానికి తనిఖీలకు ముందే పరిశ్రమ భద్రతా విభాగం ఈ విషయాన్ని గమనించాలి. దీన్నిబట్టి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

అక్కడ స్టైరీన్‌ లేని ఉత్పత్తులు

ఆ ఉత్పత్తితో కష్టమే ఎల్‌జీ పాలిమర్స్‌కు యథావిధిగా స్టైరీన్‌ ఉత్పత్తి కొనసాగించడానికి అనుమతులు ఇవ్వడం కష్టమనే అభిప్రాయాన్ని పరిశ్రమల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పర్యావరణానికి హాని కలిగించని వేరే ఏవైనా ఉత్పత్తులు తయారుచేసేలా ఎల్‌జీ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అప్పుడే అక్కడ పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించినట్లు అవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. భారీ పెట్టుబడులతో కూడిన సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోకుండా తగిన చర్యలను పరిశ్రమల శాఖ చేపట్టింది.

మూలకారణం గుర్తింపులో విఫలం....

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనకు సంబంధించిన మూలకారణాన్ని గుర్తించటంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఏర్పాటు చేసిన సంయుక్త పర్యవేక్షణ కమిటీ విఫలమైందని సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌ ఆక్షేపించింది. వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చేలా దర్యాప్తు చేయలేదని విమర్శించింది. ఈ దుర్ఘటనపై ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చి ఆ అంశాలనే నివేదికలో పొందుపరిచిందని విమర్శించింది. తగిన దర్యాప్తు లేకుండా నిరర్థక నివేదికను రూపొందించిందని ఆరోపించింది. ఈ మేరకు ఆ బృందం ప్రతినిధులు డాక్టర్‌ కె.బాబురావుతో పాటు మరికొంత మంది శాస్త్రవేత్తలు ఆ కమిటీ నివేదికను అధ్యయనం చేసి.. అందులోని లోపాలను పేర్కొంటూ ఆదివారం నివేదిక విడుదల చేశారు. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకునే నివేదిక రూపొందించారని ఆరోపించారు. కమిటీ సభ్యుల్లో కొందరు అసలు ప్లాంటును సందర్శించకుండానే నివేదికను ఆమోదించటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం ప్రతినిధులు పేర్కొన్నారు. ఎన్‌జీటీ కమిటీ నివేదికలో వారు గుర్తించిన లోపాలను తమ అధ్యయన నివేదికలో వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి..

  • స్టైరీన్‌ స్టోరేజీ కేంద్రాల ఆకృతి, నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అత్యుత్తమ ఆచరణలు ఉన్నాయి? అవి ఎల్‌జీ పాలిమర్స్‌లో అమలవుతున్నాయా? అనే అంశాల పోలిక నివేదికలో లేదు.
  • సమీప గ్రామానికి స్టైరీన్‌ ఆవిరి వేగంగా ఎలా వ్యాప్తి చెందిందో ప్రస్తావించలేదు.
  • స్టైరీన్‌ ట్యాంకు లోపల 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసేందుకు చేపట్టిన చర్యలకు సంబంధించిన డేటా గురించి ప్రస్తావించలేదు.

ఇదీ చదవండి:

శీతలీకరణ ముందురోజే ఆపేశారు: ఎన్జీటీ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.