ETV Bharat / state

Srinivas Goud on Telangana tourism : "విదేశీ యాత్రికులు.. తెలంగాణ వైపు చూస్తున్నారు" - తెలంగాణ టూరిజం

Srinivas Goud on Telangana tourism : పర్యాటకం కోసం దేశానికి వచ్చే విదేశీ యాత్రికులు.. తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనతికాలంలోనే తెలంగాణలో మెడికల్​టూరిజం బాగా అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Telangana tourism
Telangana tourism
author img

By

Published : Jul 14, 2023, 7:57 PM IST

తెలంగాణ టూరిజంపై ఉన్న.. ప్రజల నమ్మకాన్ని కొనసాగిస్తాం"

Shirdi buses in Telangana tourism : తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ తెలిపారు. అందులో భాగంగా దేశ, విదేశీ టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, షిర్డికి రెండు ఏసీ స్లీపర్ బస్సులను.. రవీంద్రభారతిలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్​యాదవ్​తో కలిసి మంత్రి ప్రారంభించారు.

హైదరాబాద్ సిటీ సైట్​సీన్ కోసం ఏసీ మినీబస్​లను ఏర్పాటుచేశారు. గతంలో ఈ రూట్​లలో స్లీపర్ బస్సులు ఉన్నప్పటికీ.. ప్రయాణికుల డిమాండ్ మేరకు మరో రెండు బస్సులను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. తెలంగాణ టూరిజం అంటే ప్రజల్లో నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తామని తెలిపారు.

రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇతర ప్రాజెక్టులు, ముఖ్యమైన ప్రదేశాలను టూరిజం హబ్​గా మారుస్తామన్నారు. భవిష్యత్​లో రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలను సర్క్యూట్ల్​గా ఏర్పాటుచేసి.. టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

మెడికల్ ​టూరిజం అభివృద్ధి.. రాష్ట్ర ఆతిథ్యం కోసం ఇతర దేశాలు పౌరులు తెలంగాణకు వస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్​మెంట్​ ఆధ్వర్యంలో దివ్యాంగులకు శిక్షణ మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ప్రారంభించారు. అనతికాలంలోనే తెలంగాణలో మెడికల్​ టూరిజం బాగా అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​కుమార్ సుల్తానియా, నిథమ్ డైరెక్టర్ వైఎన్​రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల నేతృత్వంలో నిథమ్‌ అధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనస్సున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని మంత్రి తెలిపారు.

దేశంలో పర్యాటకరంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అతిథ్యం, సహకారం అందించడంలో.. తెలంగాణ ఇతర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమాన్ని ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు.

దివ్యాంగుల బాగోగుల కోసం అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వపరంగా సమకూరుస్తూ సీఎం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. విశ్వనగరం హైదరాబాద్‌ను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచిన దృష్ట్యా విశేషాలు, అనుకూలతలు చూసి పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

"తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాము. అందులో భాగంగా దేశ, విదేశీ టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నాము. తెలంగాణ టూరిజం అంటే ప్రజల్లో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తాము". - శ్రీనివాస్​గౌడ్​, పర్యాటకశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.