ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమీక్ష - కరోనా కట్టడి చర్యలు

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

ministers-review-on-corona-prevention-measures-in-ghmc
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమీక్ష
author img

By

Published : May 17, 2021, 12:30 PM IST

గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ దృష్టిసారించారు. గ్రేటర్‌ పరిధిలో 15 రోజులుగా కొనసాగుతున్న ఫీవర్‌ సర్వేలో దాదాపు 50 వేల మందిలో కరోనా లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కేసులు కొంతమేరకు తగ్గుతున్నప్పటికీ.. జ్వర లక్షణాలు పెద్దఎత్తున ఉండటం వంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

రోజూ 20 గంటల పాటు లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. గ్రేటర్‌ పరిధిలో కరోనా కట్టడికి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చిస్తున్నారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి.. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమర్, వైద్యాధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: కరోనా కాలంలో మహిళలపై పెరిగిన వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.