ఆర్ఓఎఫ్ఆర్, పోడు, అసైన్డ్ భూముల సమస్య పరిష్కారించాలని మంత్రులు సత్యవతి రాఠోడ్, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు.. ఆయా శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ సమావేశం అయ్యారు. గతంలో ప్రకటించిన కొన్ని పథకాల అమలుపై దృష్టిసారించాలని అధికారులకు మంత్రులు సూచించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే కార్యక్రమాల వివరాలు సభ్యులు చెప్పాలని కోరారు. సంక్షేమ పథకాలు మెరుగ్గా అమలు చేయడంతోపాటు.. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి ద్వారా మరింత లబ్ధి కలిగే సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులను మంత్రులు కోరారు. కొత్త రెవెన్యూ చట్టంతో గిరిజనులకు మేలు జరగాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని భూసమస్యలు ఉన్నాయని ప్రస్తావించిన మంత్రులు వాటిని పరిష్కరించాలని సూచించారు.
ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్పై సందేహాలు.. ఈటీవీ భారత్ ప్రత్యేక కార్యక్రమం