Ministers Review On Ifthar arrangements: రాష్ట్రంలోని అన్ని కులాలు, మతా విశ్వాసాలను కాపాడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర అంతటా అధికారికంగా నిర్వహించడాన్ని మంత్రులు గుర్తు చేశారు. ఈనెల 29న ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందు ఇవ్వనున్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం స్డేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఇఫ్తార్ విందులో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు కొప్పుల, మహమూద్ అలీ సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించిన మ్యాప్‌ను మంత్రులు పరిశీలించి, స్టేడియం మొత్తం తిరిగి పర్యవేక్షించారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం రానివ్వొద్దని అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని.. వాహనాల రాకపోకలు సజావుగా సాగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.
ఇవీ చూడండి: 'పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం'
'సర్పంచులు గల్లీల్లో గల్లలెగరేసుకుని తిరిగేలా చేస్తా..'