KTR unveiled the ambedkar statue in Panjagutta: అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ పంజాగుట్టలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ పంజాగుట్ట సర్కిల్‌కి అంబేడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజునే ఆవిష్కరించుకోవటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన ఘనత కేసీఆర్ దన్న మంత్రి తారకరామారావు.. పార్లమెంట్‌కి సైతం అంబేద్కర్ పేరు పెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
"ముఖ్యమంత్రి నాయకత్వంలో భారత దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని మన ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే ఏర్పాటు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. 125 ఫీట్ల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర సచివాలయంలో కూర్చున్న వారికి రాబోయే దశాబ్దాలు, శతాబ్దాల పాటు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని నెలకొల్పాము. అంబేడ్కర్ ప్రవచించిన విధంగా 'బోధించు, సమీకరించు, పోరాడు' అనే దానిని ఒంటపట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ఆవిశ్యకత వివరిస్తూ, బోధిస్తూ.. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ.. అంబేడ్కర్ చూపిన బాటలో నడవాలి. ఆయన రాసిన ఆర్టికల్-3 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది."_ కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి
ఆయన ముందుచూపు వల్లే: అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి హరీశ్‌రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అందరికీ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేడ్కర్ ముందు చూపు వల్ల దేశంలో అన్ని రంగాల్లో ముందుకెళుతున్నామని... దళితుల గిరిజనుల కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తెచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో అన్ని గురుకుల పాఠశాలలను పదో తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు పొడిగించామన్నారు. ఈ జాతి అభివృద్ధి కోసం దళిత బంధు తెచ్చి కేసీఆర్ సాహోసోపెతమైన నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు.
నేడు దేశంలోనే అతి పెద్ద 125అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రారంభిస్తున్నాము. సచివాలయంలో నుంచి చూస్తే ఒకవైపు అమరవీరుల స్థూపం మరోవైపు అంబేడ్కర్ విగ్రహం కనబడుతుంది. అది అంబేడ్కర్ విగ్రహం కాదు విప్లవ రూపం. అంబేడ్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక. ఇంకా దళితులకు జరగవలసినది చాలా ఉంది _ కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి
ఇవీ చదవండి: