Prasanth Reddy on BJP: కేసీఆర్‌ను చూస్తే భాజపాకు వణుకు పుడుతోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ దాటి వెళ్లొద్దని భాజపా చూస్తోందని మండిపడ్డారు. కేంద్ర వైఫల్యాలను ప్రజలకు బాగా వివరిస్తారని భాజపాకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి వచ్చి రేషన్‌షాపులో మోదీ ఫొటో లేదనటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్‌ను చూస్తే భాజపాకు వణుకు పుడుతోంది. కేసీఆర్ తెలంగాణ దాటి వెళ్లొద్దని భాజపా చూస్తోంది. కేంద్ర వైఫల్యాలను ప్రజలకు బాగా వివరిస్తారని భాజపా భయం. కేంద్రమంత్రి వచ్చి రేషన్‌షాపులో మోదీ ఫొటో లేదనటం హాస్యాస్పదం. రేషన్ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. తెలంగాణ నిధులను ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు.
- వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్రమంత్రి
రేషన్ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్ల పన్నులు చెల్లించారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ నిధులను ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్రం ఖర్చు చేస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: 'అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..' నిర్మలాసీతారామన్‌కు హరీశ్ సవాల్..
తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్.. పాస్‌పోర్ట్ సమర్పించాలని సుప్రీం ఆదేశం