ETV Bharat / state

'ప్రతి ఆదివారం పది నిమిషాల్లో' పాల్గొన్న మంత్రి వేముల - 'ప్రతి ఆదివారం పది నిమిషాల్లో' పాల్గొన్న మంత్రి వేముల

'ప్రతి ఆదివారం పది నిమిషాలు' అంటూ మంత్రి కేటీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అతని నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఇంటి ఆవరణలో ఉన్న నిల్వనీటిని తొలగించారు.

minister vemula participated in every sunday 10 minutes program
'ప్రతి ఆదివారం పది నిమిషాల్లో' పాల్గొన్న మంత్రి వేముల
author img

By

Published : May 17, 2020, 12:30 PM IST

పరిసరాల పరిశుభ్రతపై 'ప్రతి ఆదివారం పది నిమిషాలు' అంటూ మంత్రి కేటీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి స్పందించారు. ఉదయం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగీ, మలేరియా తదితర వ్యాధులను నివారించవచ్చని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వేముల వివరించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధులు దరిచేరవని చెప్పారు.

ఇదీ చదవండిః డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.