ETV Bharat / state

కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది : మంత్రి ఉత్తమ్‌ కుమార్ - ts irrigation Review meeting

Minister Uttam Kumar Reddy Review Meeting Today : సాగు నీటి ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగు నీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ రంగంలో అప్పులు చేసి నిర్మించినా అందుకు తగిన ఫలితం రాలేదని విమర్శించారు.

Minister Uttam Kumar Reddy Instructions to Officials
Minister Uttam Kumar Reddy Review Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 4:06 PM IST

Minister Uttam Kumar Reddy Review Meeting Today : సంవత్సరం చివరి నాటికి కొత్తగా నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించేలా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని, దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజినీర్లను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. ప్రాజెక్టుల పనులు, నీటి విడుదల అంశాలపై అధికారులు, ఇంజినీర్లతో హైదరాబాద్ జలసౌధలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారు కానీ, అందుకు తగిన ఫలితం రాలేదని మండిపడ్డారు.

కాళేశ్వరం​పై వారం రోజుల్లో జ్యుడీషియల్ విచారణ : మంత్రి ఉత్తమ్‌

Minister Uttam Kumar Reddy Instructions to Officials : ప్రస్తుతం ఇరిగేషన్​ శాఖలో అవసరమైన నిధులతో కొత్త ఆయకట్టు సృష్టించాలని ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆదేశించారు. కొత్తగా ప్రాజెక్టుల నుంచి నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి, సకాలంలో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌(Krishna, Godavari Basin)లలోని సుమారు 18 ప్రాజెక్టుల్లో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివరి వరకు నీరు అందించనున్నారని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

"కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారు. అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించినా, అందుకు తగిన ఫలితం రాలేదు. అవసరం మేరకే వ్యయం చేసి ఆయకట్టు నిర్మించాలి. కొత్త ఆయకట్టు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంథని నియోజకవర్గానికి నీరందించే పనులు చేపట్టాలి. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది."- ఉత్తమ్​కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి

Review Meeting on Telangana Irrigation Department : రాబోయే ఐదేళ్లలో ఏ ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి మంథని నియోజకవర్గానికి నీరందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలంలోపు అన్ని చెరువుల పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఐడీసీ పరిధిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవు : మంత్రి ఉత్తమ్​ హెచ్చరిక

నెల రోజుల్లోనే ప్రజా పాలన అంటే ఏంటో చూపించాం : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.