Minister Uttam Kumar Reddy Fires on L and T Representatives : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను అంత నాణ్యత లేకుండా ఎలా చేస్తారని, నిర్మాణాలకు సంబంధించి పనులు చేసిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులపై నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సచివాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ(L&T Company) , పునరుద్ధరణ పనులకు సంబంధించి వివరాలపై మంత్రి ఆరా తీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుంటే మాత్రం ఊరుకోమని ఆయన అన్నారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.
అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడతామని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy in Review of Irrigation Sector : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో(Kaleshwaram project) కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం ఆదివారం తన నివాసంలో ఇంజినీర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, నల్ల వెంకటేశ్వర్లు నుంచి వివరాలు ఆరా తీశారు. అదేవిధంగా నిర్మాణసంస్థతో ఉన్న ఒప్పందం, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనుల పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే ఈఎన్సీ అధికారులు సైతం ఎల్ అండ్ టీ సంస్థే పునరుద్ధరిస్తుందని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కార్ ఫోకస్ - శాసనసభ వేదికగా లెక్కతేల్చేందుకు సిద్ధం
Judicial Inquiry on Medigadda : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 21వ తేదీన శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదలశాఖకు(Irrigation Department) రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలను ఇంజినీర్లు సీఎంకు వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. ఆ సంస్థతో ఒప్పందం ఎలా జరిగిందని, బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలేమిటని, ముందుకెళ్లడానికి ఉన్న వనరులు ఏమిటనే అంశాలపై సీఎం ప్రశ్నించారు. ఇవాళ మరోసారి ఇంజినీర్లతో చర్చించాలని నిర్ణయించారు.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వారికి ఛాన్స్ దక్కుతుందా?