తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. అనంతరం జోగిని శ్యామల బోనాన్ని ఎత్తుకుని, ఆడుతూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనాల ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని తెలిపారు. బోనాలకు ప్రత్యేక వరుస క్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ క్యాంప్లు, లైటింగ్ సహా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నామన్నారు. 20 తేదీ వరకు ఘట ఉత్సవాల ఊరేగింపు కొనసాగనుందని తెలిపారు. మహంకాళి ఆలయంలో కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దేశంలో పండుగలకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొనియాడారు.
ఇవీ చూడండి:భాగ్యనగరానికి బడ్డెట్ ఏదీ: కిషన్రెడ్డి