పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లి ప్రభుత్వ పాఠశాల, కళాశాలను సందర్శించి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో చర్చించారు.
పాఠశాలకు అవసరమైన ఫ్యాన్లు, లైట్లు, జిరాక్స్ మిషన్లు, ప్రింటర్లను 3, 4 రోజుల్లో అందజేస్తామని నిర్మాణ్, ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. అదే విధంగా దాతల సహకారంతో టాయిలెట్స్ నిర్మాణం, ప్రహరీ గోడ రక్షణ చర్యలను చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎక్కువగా పేద విద్యార్ధులే ఉంటారని.. వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. తమకు అండగా నిలుస్తున్న మంత్రికి విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ్ సంస్థ డైరెక్టర్ మయూర్, ఎస్ఆర్డీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.