ఛత్రపతి శివాజీలోని పోరాటపటిమను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరముందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్ డివిజన్ బోయగూడాలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఛత్రపతి శివాజీ జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు. శివాజీ చరిత్రను ప్రతి ఒక్క భారతీయుడు అభ్యసించాలని, దేశానికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పదని ప్రశంసించారు. అనంతరం శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బన్సిలాల్ పేట్ కార్పొరేటర్ కుర్మా హేమలతతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: నిందితులు ఎవరైనా వదలిపెట్టం: ఐజీ