తెలంగాణ సంస్కృతిలో భాగమే సదర్ ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని పెద్ద గణేష్ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో తలసాని పాల్గొన్నారు. దీపావళి పండుగ అనంతరం జంట నగరాల్లో యాదవులు వైభవంగా సదర్ ఉత్సవాలు జరుపుకుంటారని మంత్రి తలసాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో ప్రభుత్వపరంగా సదర్ ఉత్సవాలు నిర్వహించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఉత్సవాలకు హాజరయ్యారు. యువకులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా'