కేంద్రం బాధ్యతగా వ్యవహరించి ఆపత్కాలంలో రాష్ట్రాలను ఆదుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ శాంతినగర్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ కాలేరు పద్మతో కలిసి... వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పది వేల రూపాయల నగదును అందజేశారు.
అకాల వర్షంతో నష్టపోయిన తెలంగాణ పట్ల... కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఆదుకోవాలని తలసాని సూచించారు. ఎన్నికల కోసం వేరే రాష్ట్రాల్లో అనేక హామీలు ఇస్తున్న కేంద్రానికి... తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నట్లు తెలియదా అంటూ ప్రశ్నించారు. సర్వం కోల్పోయి పెద్ద ఎత్తున నష్టానికి గురైన ప్రజలను, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అంటూ మండిపడ్డారు.
ఇదీ చూడండి: 'ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం... శాశ్వత పరిష్కారం చూపిస్తాం'