ETV Bharat / state

ఆదిత్యకృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో మంత్రి తలసాని సరకుల పంపిణీ

హైదరాబాద్​ గోషామహల్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదిత్యకృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తెరాస 20 ఏళ్ల ప్రస్థానంలో సీఎం కేసీఆర్​ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

minister talasani srinivas yadav distributed groceries in hyderabad
ఆదిత్యకృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో మంత్రి తలసాని సరకుల పంపిణీ
author img

By

Published : Apr 28, 2020, 12:11 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదిత్య కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని ధూల్​పేట్​, చుడిబజార్, కట్టెలమండితో పాటు పలు ప్రాంతాల్లో 2వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరకులతో పాటు మాస్కులను మంత్రి తలసాని, ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్​లు పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెరాస పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. రాష్ట్రం సాధించిన 6 సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 21వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంపై ట్రస్ట్ ఛైర్మన్​ను మంత్రి అభినందించారు.

ఇవీ చూడండి: క్యాన్సర్​తో పాటు కరోనాను జయించిన నాలుగేళ్ల శివాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.